'యాంటీ సూసైడ్ ఫ్యాన్ రాడ్'.. ఈ ఫ్యాన్లకు ఉరేసుకోలేరు..!
11:42 AM Nov 13, 2024 IST | Vinod
UpdateAt: 11:45 AM Nov 13, 2024 IST
Advertisement
చదువుల ఒత్తిడి, కుటుంబకలహాలు, డిప్రెషన్ రకరకాల కారణాలతో అనేకమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. వారిలో ఫ్యాన్ కు ఉరివేసుకుని చనిపోయే వారి సంఖ్యే ఎక్కువ. అయితే ఈ ఆత్మహత్యలను ‘యాంటీ సూసైడ్ ఫ్యాన్ రాడ్’లను బిగించడం ద్వారా నివారించవచ్చు. ఇది ఎలా పనిచేస్తుందంటే.. సీలింగ్ ఫ్యాన్‌కు పై భాగంలో ఈ స్ర్పింగ్ రాడ్‌ను అమరుస్తారు. ఇది 20 కిలోల కంటే ఎక్కువ బరువు ఉన్న వస్తువును భరించదు. ఒకవేళ అంతకన్నా ఎక్కువ బరువును వేలాడదీస్తే ఆ స్ర్పింగు విస్తరిస్తుంది. అంటే.. ఫ్యాన్‌కు ఉరివేసుకునేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే వెంటనే వారు నెలకు తాకి ఆగిపోతారు. ఇది నిజంగా అద్భుతమైన ఐడియా అని చెప్పాలి.
Advertisement