జపాన్‌లో మరో విప్లవాత్మక ముందడుగు.. తెరపైకి సరికొత్త టెక్నాలజీ..!
01:06 PM Nov 02, 2024 IST | Vinod
UpdateAt: 01:06 PM Nov 02, 2024 IST
Advertisement
జనాభా సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోన్న జపాన్ డ్రైవర్ల కొరతను అధిగమించడంతో పాటు కర్బన ఉద్గారాలను తగ్గించడం కోసం ఆటోమేటిక్ కార్గో ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థను తెరపైకి తీసుకువచ్చింది. ఇందుకోసం కన్వేయర్ బెల్ట్ సాయంతో ఒసాకా, టోక్యో నగరాల మధ్య పార్శిళ్ల రవాణాకు ప్రత్యేక మార్గం వేస్తామని ప్రకటించింది. ఈ ప్రాజెక్టు నమూనా వీడియోను విడుదల చేసింది. 2030 కల్లా ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించేలా ప్రభుత్వం ముందుకు కదులుతోంది.
Advertisement