అన్నదాతలకు మరో శుభవార్త.. డిసెంబర్ లోపు పక్కాగా రుణమాఫీ..!
08:13 PM Nov 15, 2024 IST | Shiva Raj
UpdateAt: 04:15 PM Nov 15, 2024 IST
Advertisement
వికారాబాద్ జిల్లా లగచర్లలో భూములు లేని నిరుపేదలను రెచ్చగొట్టారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ నేతల హస్తంపై పోలీసులు వెలికితీస్తారని కీలక వ్యాఖ్యలు చేశారు. తప్పుచేసిన వారిని ప్రభుత్వం వదిలిపెట్టదని చెప్పారు. తెలంగాణలో రూ.2 లక్షల లోపు రైతుల రుణాలను మాఫీ చేశామని వెల్లడించారు. రూ.2 లక్షల కంటే ఎక్కువ ఉన్నవారికి త్వరలో రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. మిగిలిన రైతులకు డిసెంబర్ లోపు పక్కాగా రుణమాఫీ చేస్తామని వ్యాఖ్యానించారు. మిగిలిని రూ.13 వేల కోట్లు త్వరలోనే చెల్లిస్తామన్నారు. త్వరలో రైతు భరోసా ఒక కిస్తీ చెల్లిస్తామని చెప్పారు.
Advertisement