డాన్స్ మాస్టర్ జానీకి మరో భారీ షాక్.. ఆ పాన్ ఇండియా సినిమా నుండి అవుట్
ప్రముఖ డాన్స్ మాస్టర్ జానీకి భారీ షాక్ ఇచ్చిన పుష్ప మూవీ టీమ్. జానీ మాస్టర్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని తన అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సెప్టెంబర్ 16న నార్సింగి పోలీసులు అతనిపై 376, 506, 323 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.ఆ తర్వాత కోర్టు రిమాండ్ విధించడంతో చంచల్గూడ జైలులో ఉన్నాడు. అయితే ఈ కేసు కారణంగా నేషనల్ అవార్డు పోయింది.. అలానే సినిమా ఛాన్సులు కూడా రాకుండా పోతున్నాయి. తాజాగా 'పుష్ప 2'లో జానీ మాస్టర్ ప్లేస్లో మరో కొత్త డ్యాన్స్ మాస్టర్ని ఎంపిక చేసినట్లు 'పుష్ప' సినిమా నిర్మాతలు తెలిపారు. 'పుష్ప' మొదటి భాగంలో 'సామీ సామీ' అనే పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. 'పుష్ప 2'లో ఒక పాట కోసం జానీ మాస్టర్ ని అనుకున్నారు. అయితే ఆలోపే లైంగిక ఆరోపణలు కేసులో పోలీసులు మాస్టర్ ని అరెస్టు చేచేసారు. ఈ తరుణంలో మేకర్స్ జానీ మాస్టర్ స్థానంలో మరొకరిని తీసుకున్నారు. ఈ విషయాన్నీ స్వయంగా నిర్మాత నవీన్ 'పుష్ప 2' ప్రెస్ మీట్ లో తెలిపారు.