నటి శ్రీరెడ్డిపై బొమ్మూరులో పోలీస్ కేసు నమోదు
07:36 PM Nov 13, 2024 IST
|
Teja K
UpdateAt: 07:36 PM Nov 13, 2024 IST
Advertisement
నటి శ్రీరెడ్డిపై తూర్పుగోదావరి జిల్లాలో పోలీసు కేసు నమోదైంది. శ్రీరెడ్డిపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి, మాజీ కార్పొరేటర్ మజ్జి పద్మ ఫిర్యాదు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్, హోమ్ మంత్రి అనితలపై సోషల్మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. శ్రీరెడ్డిపై బీఎన్ఎస్ సెక్షన్లు 196, 353, 79, 67 కింద పోలీసులు కేసు నమోదు చేసారు. గత ప్రభుత్వంలో ప్రతిపక్ష నాయకులపైనే కాక వారి కుటుంబాలపై కూడా సోషల్మీడియాలో శ్రీరెడ్డి చెప్పరాని వ్యాఖ్యలు చేసిందని, ఆమెను స్త్రీ జాతి నుంచి వెలేస్తున్నామని ఆమె తెలిపారు.
Advertisement
Advertisement
Next Article