సరికొత్త ముందడుగు.. త్వరలో అంతరిక్షం నుంచే విద్యుత్ ఉత్పత్తి..!
11:45 AM Nov 12, 2024 IST | Shiva Raj
UpdateAt: 11:45 AM Nov 12, 2024 IST
Advertisement
సౌర విద్యుత్ ఉత్పత్తిలో సరికొత్త ముందడుగు పడనుంది. త్వరలో అంతరిక్షం నుంచే విద్యుత్తును ఉత్పత్తి చేసే అవకాశం కలగనుంది. ఈ మేరకు యూకేకు చెందిన స్పేస్ సోలార్ అనే స్టార్టప్, ఐస్‌లాండ్ దేశానికి చెందిన విద్యుత్ ఉత్పత్తి సంస్థ రేక్‌జావిక్ ఎనర్జీ ఒప్పందం కుదుర్చుకున్నాయి. 2030 నాటికి 30 మెగావాట్ల అంతరిక్ష ఆధారిత సౌర విద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించాలనేది ఈ ఒప్పంద లక్ష్యం.
Advertisement