ప్రముఖ నటుడి సోదరుడికి తీవ్ర అస్వస్థత..!
12:33 PM Nov 01, 2024 IST | Vinod
UpdateAt: 12:33 PM Nov 01, 2024 IST
Advertisement
అగ్రనటుడు కమలహాసన్ సోదరుడు, సీనియర్ తమిళ నటుడు చారుహాసన్ (93) అస్వస్థతకు గురయ్యారు. గురువారం రాత్రి ఆయనను చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. ఈ విషయాన్ని ఆయన కుమార్తె, నటి సుహాసిని మణిరత్నం సోషల్ మీడియాలో వెల్లడించారు. “దీపావళికి ముందు మా తండ్రి అస్వస్థతకు గురయ్యారు. మా పండుగ ఎమర్జెన్సీ వార్డులో గడిచిపోయింది. ప్రస్తుతం ఆయన సర్జరీకి సిద్ధమవుతున్నారు” అని నటి రాసుకొచ్చారు.
Advertisement